రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై పోసాని కృష్ణమురళి కామెంట్స్

  • ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పోసాని చిత్రం 'ఆపరేషన్ అరుణా రెడ్డి'
  • రామ్ చరణ్ గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి అన్ని పోసాని
  • 'పెద్ది' అద్భుత విజయాన్ని అందుకోవాలని ఆకాంక్ష

టాలీవుడ్ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి తాను ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన ‘ఆపరేషన్ అరుణా రెడ్డి’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’కి ముందో వెనుకో ఈ సినిమా రిలీజ్ కానుండటంపై ఆయన స్పందించారు. ‘పెద్ది’ సినిమా భారీ విజయం సాధించాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని, అందుకు ప్రధాన కారణం రామ్ చరణ్ వ్యక్తిత్వమేనని పోసాని కొనియాడారు.


ఈ సందర్భంగా గతంలో రామ్ చరణ్‌తో కలిసి నటించిన ‘నాయక్’ సినిమా నాటి ఒక జ్ఞాపకాన్ని పోసాని గుర్తు చేసుకున్నారు. ‘నాయక్’ మూవీలో తన పాత్రకు చాలా మంచి గుర్తింపు వచ్చిందని, కొన్ని సీన్స్‌లో హీరో చరణ్‌ను డామినేట్ చేసే స్థాయిలో తనకు స్క్రీన్ స్పేస్, క్రేజ్ దక్కినప్పటికీ చరణ్ ఎప్పుడూ దాన్ని ఈగోగా తీసుకోలేదని చెప్పారు. పైగా ఒకరోజు చరణ్ తనను పిలిచి.. "నాన్న చిరంజీవి గారు సినిమా చూశారు, చాలా బాగుంది అన్నారు. ముఖ్యంగా పోసాని గారి సీన్లు థియేటర్లలో బాగా పేలుతాయి, ఆయన ఉన్న ఒక్క సీన్ కూడా ఎడిట్ చేయొద్దని నాన్న చెప్పారు" అంటూ ఎంతో సంతోషంగా పంచుకున్న విషయాన్ని గుర్తుచేశారు.


సహనటుడికి అంతలా గౌరవం ఇచ్చే గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి రామ్ చరణ్ అని, ఆయన మనసు చాలా మంచిదని పోసాని ప్రశంసించారు. అందుకే చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.



Ram Charan
Posani Krishna Murali
Peddi Movie
Operation Aruna Reddy
Nayak Movie
Chiranjeevi
Telugu Cinema
Tollywood
Movie Release
Film Industry

More Telugu News